వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సోదరి షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. షర్మిల చెప్పేవన్నీపచ్చి అబద్ధాలేనని కొట్టి పారేశారు. పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైయస్ జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. అలాంటి చెల్లెలు చంద్రబాబు కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తారన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైయస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారని రాచమల్లు దుయ్యబట్టారు.
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే..
