కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్వీట్లు పెట్టకుండా చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నీ పనికి మాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదని మెదడు కూడా కోల్పోయావని స్పష్టమవుతుందన్నారు. ప్రధాని మోడీ తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ కి సంబంధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా రాష్ట్ర బీజేపీ నేతలంతా ‘కలిసికట్టుగా పని చేయండి’ అనే శీర్షికతో ‘దిశ’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్ లో షేర్ చేస్తూ కేటీఆర్ పోస్టు చేశారు. మోడీ గారు మీ కలమం నేతలు, కాంగ్రెస్ నేతలు కలిసిపోయి మరీ కలిసికట్టుగా పని చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రఘునందన్ రావు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తే కేటీఆర్ ఈ పాటికే జైలు పాలు అయ్యేవాడని అన్నారు.