రాష్ట్రానికి మరోసారి భారీ వర్షం పడే సూచన ఉందని నేడు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సౌత్ తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22న ఆ ఆవర్తనం బలపడి బంగాళాఖాతంలో అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. ఈ మొత్తం పరిణామంతో ఇవాళ రాష్ట్రంలోని తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, మన్యం జిల్లాల్లో మోస్తరు నంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో భారీ ఈదురుగాలులతో సహా పిడుగులు పడే అవకాశం కూడా అధికారులు తెలిపారు.
మరోసారి భారీ వర్ష సూచన.. అక్కడ పిడుగులు పడే చాన్స్
