ఉరుములు, మెరుపులతో కురవనున్న వర్షాలు..

have-rain-19.jpg

తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులకు వెళ్ళేవారు. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే భయపడుతున్నారు. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండలకు తోడు వడగాలు వీస్తుండటంతో చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెల నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. తాజా అలర్ట ప్రకారం సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్, జగిత్యాల, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అలాగే ఈ నెల 21, 23,న తేలికపాటి వర్షాలు కురవనుండగా 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అకవాశం ఉందని హైదరాబాద్ ఐఎమ్‌డీ పేర్కొంది. ఈ వార్తతో తెలంగాణ ప్రజలతో పాటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top