అప్సరలా మెరిసిపోతున్న రకుల్..

rakul-04.jpg

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక టాలీవుడ్‌లో ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ చెక్కేసిన రకుల్ అక్కడే వరసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం చేసుకుంది ఈ బ్యూటీ.

ఇక ఈ మధ్య రకుల్ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చంకీలు ఉన్న క్రీం కలర్ సారీలో మెరిపోయింది. ఈ చీరలో ఈ అమ్మడు అచ్చం అప్సరాలా కనిపిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ మెరీ హస్బెండ్ మూవీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంత ముద్దుగా ముస్తాబైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆఫొటోస్ పై మీరు ఓ లుక్ వేయండి.

Share this post

scroll to top