ఫ్యాన్స్ కి ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలి..

rc-30.jpg

గేమ్ ఛేంజర్ రిజల్ట్ పరిచినా కూడా ఏ మాత్రం డీలా పడకుండా ఫ్యాన్స్ ను ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. డైరెక్టర్ శంకర్ కారణంగా మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను పరుగులు పెట్టించనున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సీ 16ని జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్.

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను ఆర్సీ 16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. కుదిరితే దసరా లేదంటే దీపావళికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్‌లు వేయించాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా మూడు ట్యూన్స్ సిద్ధం చేశాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈసారి దసరా, దీపావళి సీజన్లో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కంటే మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందనే టాక్ ఉంది.

Share this post

scroll to top