గ్లోబల్‌స్టార్‌ సూపర్‌స్టార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ఇది నిజమెనా..

ram-charan-31.jpg

RRR తర్వాత తెలుగులో మల్టీస్టారర్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ పెరిగింది. గతంలో మల్టీస్టారర్‌ సినిమాలంటే ఆమడ దూరం ఉండే హీరోలు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఏకంగా తమ స్టార్‌ డమ్‌ను పక్కనపెట్టి నెగిటివ్‌ రోల్స్‌ కూడా ఎంచుకుంటున్నారట. తాజాగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ, తమిళ సూపర్‌స్టార్‌ సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమాలో తమిళ స్టార్‌ హీరో సూర్య విలన్‌ చేయబోతున్నాడనేది తాజా గాసిప్‌. ఫిలంనగర్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్న ఈ ప్రచారంలో ఎంత నిజముందోగానీ, అదే జరిగితే సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్‌లో సూపర్‌ స్టార్‌ సూర్యకు తెలుగులోనూ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన నెగిటివ్‌ రోల్‌లో నటిస్తారనే టాక్‌ హీట్‌ పుట్టిస్తోంది. గతంలో ట్వంటీ ఫోర్‌ అనే చిత్రంలో ద్విపాత్రిభినయం చేసిన సూర్య ఓ క్యారెక్టర్‌లో నెగిటివ్‌ పాత్ర పోషించారు. విక్రమ్ సినిమాలో కూడా చివర్లో రోలెక్స్ పాత్రలో నెగిటివిటీ చూపించారు. ఇక రామ్‌చరణ్‌తో సినిమాలో పూర్తిస్థాయి విలన్‌గా నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Share this post