టాలీవుడ్‌లో సెన్సేషనల్ మల్టీస్టారర్..

nbk-6-.jpg

ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌ను చూపిస్తోన్న రామ్ పోతినేని నటించబోయే కొత్త సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ఫలానా దర్శకుడితో చేయబోతున్నాడని చాలా రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, హరీశ్ శంకర్ సహా ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ స్టార్‌తో మల్టీస్టారర్ రామ్ పోతినేని నటించబోయే కొత్త సినిమా గురించిన ఓ సంచలన వార్త తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. అతడు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇది బాలయ్యకు 111వ సినిమా కాబోతుందని అంటున్నారు. రామ్ పోతినేని – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ దర్శకుడు మహేశ్ బాబు పీ తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అతడు దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేశాడని అంటున్నారు. ఇప్పటికే ఈ కథను రామ్ పోతినేనికి వినిపించాడని, త్వరలోనే బాలయ్యతో కూడా సమావేశం అవబోతున్నాడని తెలిసింది.

Share this post

scroll to top