హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏ రేంజ్ లో రఫ్ఫాడించిందో తెలిసిందే. అదే సీన్ మళ్ళీ రీ క్రియేట్ చేయాలని ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ చేశారు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. ఈ రోజే ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ట్విట్టర్‌లో డబుల్ ఇస్మార్ట్ బజ్ క్రియేట్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజున రామ్, పూరి జగన్నాథ్ ఖుషీ అయ్యే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో రామ్ రెట్టింపు ఎనర్జీతో ఆకట్టుకున్నాడని, సినిమాలో హైలైట్ ఆయన పాత్రనే అంటున్నారు. ఫస్టాఫ్ అదుర్స్ అంతే.. ర్యామ్ ఆడించారు అని పేర్కొంటున్నారు. పూరీ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ ఇది అనే పోస్టులు కనిపిస్తున్నాయి.
డబుల్ ఇస్మార్ట్ పబ్లిక్ టాక్.. రచ్చ రంబోలే..
