దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వ్యాపార రంగంలో సాధించిన విజయాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ దేశంలోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార వేత్తలు నివాళులర్పించారు.
అసాధారణ మానవతావాదిని కోల్పోయాం..
