నటి హేమకు మరోసారి నోటీసులు

hema-s.jpg

బెంగళూరు ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ హాజరు కాలేదు. అయితే హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల పోలీసులు తేల్చారు. కాగా నటి హేమ తాజా నోటీసులకు ఎలా స్పందిస్తారు.. విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

Share this post

scroll to top