మిస్టర్ బచ్చన్ సినిమా అంతా మొదటి నుంచి చివరి వరకు రవితేజ మయంగా కనిపిస్తుంది. ప్రేక్షకులు రవితేజను ఎలా చూడాలనుకుంటారో హరీశ్ శంకర్ అలానే చూపించి సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఆయన క్యారెక్టర్ ముందు ఇతర పాత్రలన్నీ తేలిపోయాయి. ఉన్నంతలో భాగ్యశ్రీ అందం, అమాయకపు నటన, పాటల్లో ఒలకబోసిన గ్లామర్, డ్యాన్స్ పెద్ద ఎస్సెట్. ఆతర్వాత సత్య కామెడీ ఫస్టాఫ్‌ను నిలబెట్టగా సినిమా మొత్తానికి మిక్కీ జే మేయర్ సంగీతం చాలా బలాన్ని చేకూర్చింది. ఆయన అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక టెక్నికల్ పరంగా కూడా ఎలాంటి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే.. దర్శకుడు హరీశ్ శంకర్ టేకింగ్ బావుండి సినిమాను స్పీడుగా నడిపించినప్పటికీ సెకండాఫ్ కథపై దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి క్వాలిటీ కోసం ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు.
మిస్టర్ బచ్చన్ ఎలా ఉందంటే..
