ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయాలు ఎల్లప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు తమ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, పాలు, మాంసం వంటివి రోజువారీ ఆహారాల్లో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఈ ఆహారాలకు సంబంధించి పలు అపోహలు కూడా ప్రజల్లో నెలకొంటున్నాయి. ఏంటంటే వండిన వాటికంటే పచ్చివి తినడం మంచిదని కొందరు చెప్తుంటారు.
బంగాళ దుంపలు, రబ్బర్ లీవ్స్..
కొందరు బంగాళ దుంపలను పచ్చివిగా తింటే బలం వస్తుందని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. పైగా అలా తినడంవల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే రా పొటాటోస్ తినడంవల్ల వీటిలోని పిండి పదార్థాలు జీర్ణ వ్యవస్థను గందరగోళ పరుస్తాయి. అంతేకాకుండా వీటిలో గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయని, ఇవి జీర్ణ సంబంధింత సమస్యలకు, అలర్జీలకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
మష్రూమ్స్, పచ్చి పాలు, పచ్చి గుడ్లు..
సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం రకారకాల మష్రూమ్స్ దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో వైల్డ్ మష్రూమ్స్ కూడా ఒకటి. అయితే వీటిని పచ్చివిగా తినడం సేఫ్ కాదు, తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. కాబట్టి ఏ పుట్టగొడుగులైనా సరే ఉడికించి లేదా వండి తినడంవల్ల రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇక చాలా మందిలో ఉండే మరో అపోహ ఏంటంటే పచ్చి పాలు, పచ్చి గుడ్లు తినడం, తాగడంవల్ల బలం వస్తుందని చెప్తుంటారు.
వివిధ జంతువుల మాంసం..
సాధారణంగా చికెన్, ఫోర్క్, బీఫ్ ఇలా ఏ మాంసమైనా వండుకొని తింటారు. అయితే కొందరు పచ్చిగా తింటే శరీరానికి బలం వస్తుందని చెప్తుంటారు. బలం రాదు కానీ ప్రాణహాని మాత్రం సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
పచ్చి మొలకలు, పచ్చి వంకాయ..
పచ్చి మొలకలు, పచ్చి వంకాయ తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు అనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇవి హానికరం. పచ్చి వంకాయలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. వాస్తవానికి ఇది గ్లైకోల్కలాయిడ్ పాయిజన్. పచ్చిగా తింటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. తినకూడదు, కొందరు పఫర్ ఫిషెస్‌ను పచ్చిగా తినాలని అంటుంటారు. వాస్తవానికి ఇవి వండి తిన్నా నష్టమే. వీటిలో టెట్రోడోటాక్సిన్ అనే పాయిజనింగ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి తినకూడదు.
కాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, ముడితేనె..
కాలీ ఫ్లవర్ పచ్చిగా ఉన్నప్పుడు విషపూరిత గుణాలు లేనప్పటికీ, తినడంవల్ సరిగ్గా జీర్ణం అవదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉడికించి లేదా వండుకొని తినడమే సేఫ్. బ్రోకలీ విషపూరితం కానప్పటికీ పచ్చిగా తింటే సరగ్గా జీర్ణం కాదు. ఇబ్బంది తలెత్తవచ్చు. క్యాబేజీ, బ్రోకలీలో కూడా పచ్చిగా ఉన్నప్పుడు తినడంవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు అవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.