రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ పోస్ట్..

renu-desayi-11.jpg

రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెండో పెళ్లి గురించి రాసుకొచ్చింది. ముఖ్యమైన అంశాల కంటే మీడియా వ్యక్తులు నా రెండవ వివాహ అంశంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నేను గ్రహించాను. ప్రేక్షకులుగా మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో అది చూపిస్తుంది. రుజువు చేస్తుంది. కాబట్టి సుంకం ఆంక్షలు, మహిళల భద్రత, ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి దయచేసి 44 ఏళ్ల వృద్ధురాలి పునర్వివాహం నుంచి మీ దృష్టిని మరల్చాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను నా వివాహం గురించి వందసార్లు మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దయచేసి మీ విద్య, జర్నలిజం అనుభవాన్ని కొంతమంది పెద్దల రెండవ వివాహం కోసం ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది సమాజం లేదా శాంతిభద్రతలను ప్రభావితం చేయదు అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది.

Share this post

scroll to top