విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మండలిలో గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్‌తో కూడిన అంశమని చెప్పారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ వద్దే స్పష్టం చేశారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మా హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగనివ్వలేదన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాము పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంత్రులు పవన్, అచ్చెన్నాయుడు మాటకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన..
