కటిక పేదరికంతో ఫీజు కట్టలేక మేకల కాపరిగా మారిన మధులత ..

cm-ravanth-25.jpg

కనీస వసతులు లేని ఒక గిరిజన తండా ఆమ్లెట్ గ్రామం అది. రెక్కడితేగాని డొక్కాడని కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డల్ని పెంచి పెద్దచేసాడు ఆ నిరుపేద తండ్రి. పేదరికం అడ్డు వస్తున్న సొంత రెక్కల కష్టంతో ముగ్గురునీ డిగ్రీ వరకు చదివించాడని స్థానికులు చెబుతున్నారు. చిన్న కుమార్తె చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంది. ఎంతో కష్టపడి డిగ్రీ వరకు చదివి ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో పై చదువులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకుతో అర్హత సాధించింది. కటిక పేదరికంతో ఫీజు కట్టలేక మేకల కాపరిగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎవరన్నా దాతల సహకారంతో పై చదువులు చదవాలని ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. IIT పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తి అయ్యే దాకా ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డంకులు తొలగిపోయాయి. రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బదావత్ సరోజ రాములు దంపతులకు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి, వ్యవసాయ పనుల్లో సహాయ పడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంక్ సాధించారు. పాట్నా ఐఐటీ లో సీట్ వచ్చింది.

Share this post

scroll to top