రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారు. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. మేము సవాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలి.
ఒక భీమదేవరపల్లి మండలంలో 21 కోట్లు రైతు రుణమాఫీ..
