పాలిటిక్స్‌లో ఫ్రెండ్‌షిప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. కొందరు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా స్నేహానికే పెద్ద పీట వేస్తారు. పొలిటికల్ ఫ్రెండ్‌షిప్‌లో ప్రధానంగా గుర్తుకువచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరి మధ్య స్నేహం రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ బ్రదర్స్‌గా పేరొందిన దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి మధ్య కూడా స్నేహానికి చిరునామాగా నిలిచారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అచ్చం అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ఇప్పటిది కాదు 16 ఏళ్లుగా వీరి మధ్య స్నేహం బంధం కొనసాగుతోంది. అది మరింత బలోపేతం అవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడినా గానీ.. వేం నరేందర్ రెడ్డితో స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజకీయంగా ప్రతీ విషయంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరూ కలిసి జర్నీ చేయడం.. ప్రతీ ఆపదలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలుస్తున్నారు.
వైఎస్సార్, కేవీపీ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్..
