తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం సీఎం రేవంత్ రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. అనంరతం ఇవాళ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి తరఫున ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు మహాకూటమి నేతలు సిద్ధమయ్యారు.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి..
