రెవెన్యూ అధికారుల తడాకా.. బెడిసికొట్టిన డబుల్ ధమాకా.. వ్యవసాయం ముసుగులో ఆ బిజినెస్..

farmar-11.jpg

రైతు బంధు స్కీమును తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద స్కామ్‎కు పాల్పడ్డాడు ఒక భూ యాజమాని. వ్యవసాయ భూమిగా ఉన్న పోలాన్ని ఓపెన్ ప్లాట్లుగా మార్చాడు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలంలో చోటు చేసుకుంది. అయితే అదే క్రమంలో రైతు ముసుగు వేసుకుని తన పొలంలో వ్యవసాయం చేస్తున్నట్లు చూపించి కొంత కాలంగా ప్రభుత్వం అందించే రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ తన 33 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా రూ. 16లక్షలు పొందినట్లు అధికారులు గుర్తించారు. పంట పండించే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్రయోజనాలను మోసపూరితంగా క్లైయిమ్ చేసినందుకు ఆ భూ యాజమానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తన పంటపొలాలను కొన్ని సంవత్సరాల క్రితం చట్టవిరుద్ధంగా ప్లాట్‌లుగా మార్చాడు. ఆ ఫ్లాట్లకు సర్వే నంబర్లు కేటాయించి క్రయవిక్రయాలు జరిపాడు.

Share this post

scroll to top