దయచేసి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దు..

ponam-05.jpg

సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సమస్యలు తొలుగుతున్నాయని మంత్రి అన్నారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఒక్కటైన ఇబ్బంది పెట్టామా? అని మంత్రి ప్రశ్నించారు. సొమవారం మినిస్టర్ క్వార్టర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా అని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి తాను కానీ ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు సైతం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

Share this post

scroll to top