వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సజ్జల భార్గవ్ కు మరోసారి ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. సజ్జలను అరెస్ట్ చేయొద్దని గత విచారణలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా కూడా మధ్యంతర ఉత్తర్వులను మరో ఏడు రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సజ్జలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి పీపీ వివరించారు. దీంతో తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
భార్గవ్‌కు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు..
