సమంత ప్రజెంట్ ‘సిటాడెల్-హనీ బన్నీ’ అనే వెబ్‌సీరిస్‌తో బిజీగా ఉంది. ఇది త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ వెబ్‌సీరిస్‌లో నటించినందుకు ఈ బ్యూటీ ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇది సౌత్ హీరోయిన్స్ పారితోషికంలో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు ఇండస్రీ విశ్లేషకులు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఇంత పెద్ద మొత్తం అందుకోలేదట. అందులోనూ సినిమా కాకుండా ఓ వెబ్‌సీరిస్‌కు అందుకోవడం కూడా విశేషమనే చెబుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. గతంలో కూడా తెలుగు సినిమాల్లో రెమ్యూనరేషన్స్ విషయంలో సమంత ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రజెంట్ ఈ రెమ్యూనరేషన్ టాపిక్ హాట్ న్యూస్‌గా మారింది.
రెమ్యునరేషన్ పెంచేసిన సమంత..
