ఎన్నాళ్లకు ఈ హిట్ జోడి రిపీట్..

allu-09.jpg

ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం AA 22 X A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతో తెలియజేశారు మేకర్స్.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇన్నాళ్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో సమంత కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత సామ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి బన్నీతో సామ్ జతకట్టనుందనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

Share this post

scroll to top