గుంటూరు జైలులో ఉన్న సురేశ్‌ను మూడు రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట ఉన్న మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జైల్లో విధులు నిర్వహిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషా భాను జగన్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంది. అంతేకాదు జగన్ కు షేక్‌హ్యండ్ కూడా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్ కు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైఎస్ జగన్తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇవ్వడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించింది. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడింది.
వైఎస్ జగన్తో సెల్ఫీ ఛార్జీమెమోకు సిద్ధమైన అధికారులు..
