అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విసయం పై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటిక పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందేే. కాగా హైదరబాద్ లో 208మంది పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో హై అలెర్ట్ ప్రకటించి వారిని వెనక్కి పంపించేందుకుు చర్యలు చేపట్టారు. మరోవైపు హైదరాబాద్ ఎస్ బీ లో 208 పాకిస్తాన్ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నాారని ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదానికీ నీడనిస్తున్న దేశం పై భారత్ కఠినంగా వ్యవహరించాలని అంతర్జాతీయ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయని ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు.
పాకిస్తానీయులను వెనక్కి పంపండి..
