ప్రెస్ అకాడమి చైర్మన్ రేస్ లొ తెలంగాణ జర్నలిస్ట్..

telangana-20.jpg

ఏపీ నేతలు తెలంగాణ రాగం పాడేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. జగన్ తెలంగాణ వాళ్లకు రాజ్యసభ ఇస్తె అందరూ దుమ్మెత్తి పొశారు. అయినా జగన్ మొండిగా వ్యవహరించారు ఫలితం అనుభవించారు. పార్టీ పదవి అయితె వాళ్ల ఇష్టం. కాబట్టి ఎవరూ అడగరు అయితే ప్రభుత్వం తరుపున ఇచ్చే పదవులు కుడా తెలంగాణ కు కట్టబెట్టాలని చూస్తే ఆంద్ర ప్రజలు ఎలా చూస్తూ ఊరుకుంటారు. తాజాగా ప్రెస్ అకాడమి చైర్మన్ రేస్ లొ తెలంగాణ జర్నలిస్ట్ ఉన్నాడని తెలుస్తుంది. దాదాపు తెలంగాణా కు చెందిన రిటైర్డ్ జర్నలిస్ట్ కి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఖరారైందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అదే జరిగితే ఆంధ్ర జర్నలిస్టు లను అవమానించినట్టే అవుతుంది. ఈ విషయంలో
జరుగుతున్న ప్రచారం నిజమో అసత్యమో తెలియదు. ఒకవేళ నిజమైతే చంద్రబాబు ఒకసారి ఆలోచించాలని ఆంధ్ర జర్నలిస్టు ల మనోబావాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share this post

scroll to top