భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం అమ్మవారు ఆదిలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజ నిర్వహించారు. ఈ నెల 12 వరకు రోజూ అమ్మవారిని అలంకరించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర కూడా నిర్వహించనున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లాలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు.
నేడు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు..
