ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి వెంటనే దర్యాప్తు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మత ఘర్షణలకు ఆజ్యం పోసే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది దీక్షలు, ప్రమాణాలు కాదని నిజం కావాలన్నారు. హిందూ మతంపై దాడి అని బీజేపీ మాట్లాడుతోందని చర్చిలు, మసీదుపై దాడి జరిగితే ఇలాగే ఉంటారా అని పవన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. మత విద్వేషాలు పెంచే ఆలోచన కూటమి నేతలకు ఉందా అంటూ షర్మిల నిలదీశారు. మతాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఉద్దేశమని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. కనీసం సీబీఐ విచారణ జరగాలని మోదీకి ఎందుకు అనిపించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు..
