డాన్ 3లో హీరోయిన్‌గా శార్వరీ వాగ్..

sarvari-13-.jpg

బాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డాన్‌ ఫ్రాంచైజీలో తాజాగా రూపొందుతున్న చిత్రం డాన్ 3. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా డైరెక్టర్ ఫర్హాన్‌ అక్తర్‌ తెరకెక్కించనున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ నటించిన డాన్, డాన్ 2 చిత్రాలకు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, కియారా ప్రెగ్నెన్సీ కార‌ణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కియారా స్థానంలో హీరోయిన్‌గా శార్వరీ వాగ్ నటించబోతున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

శార్వరీ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉంది. గతేడాది ముంజా అనే హారర్-కామెడీ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ, బిజీ బిజీగా మారింది. మహారాజ్, వేదా వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇటీవల ఆలియా భట్, బాబీ డియోల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఆల్ఫాలో నటించింది.

Share this post

scroll to top