రెగ్యులర్‌గా వార్తల్లో నయనతార..

nayana-thara-02.jpg

ఏదో ఒక హాట్ టాపిక్‌తో రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్‌తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకుని మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ డేకు హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడమ్ పేరు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి రూ. 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ వెళ్లిందో అప్పటి నుండి రెమ్యునరేషన్ ఛేంజ్ చేసింది. జవాన్ కోసం ఆమెకు రూ. 10 కోట్లు ఇచ్చాడట అట్లీ. నార్త్‌లో అంత ఇస్తున్నారు కదా ఇక్కడ ఎందుకు ఇవ్వరు అనుకున్న నయన్ సౌత్‌లో కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు వేరే లెవల్లో చార్జ్ చేస్తోంది ఈ బ్యూటీ. టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా రూ. 12 కోట్లను తీసుకుంటుందట నయన్. ఇక చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్‌ను అడిగితే ఏకంగా రూ. 18కోట్లు డిమాండ్ చేసిందట లేడీ సూపర్ స్టార్. దీంతో ఖంగుతిన్న టీం మరో ఆప్షన్ కోసం చూస్తున్నట్లు టీఎఫ్ఐలో వార్త చక్కర్లు కొడుతుంది. డిమాండ్ కు తగ్గట్టే రెమ్యునరేషన్ పెంచుతున్న నయన్ లేడి సూపర్ స్టార్ అనిపించుకుంది.

Share this post

scroll to top