ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌..

brs-28.jpg

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్‌పై గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోగా.. కాంగ్రెస్‌ తరఫున వ్యక్తి నూతన ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగింది. ప్రస్తుత చైర్మన్‌పై 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. వారికి మరో ఐదుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చారు.  దీంతో డీసీసీబీలో ప్రస్తుత డైరెక్టర్ల సంఖ్య 19కు చేరింది. బీఆర్‌ఎస్‌ గొంగడి మహేందర్‌రెడ్డి పదవి కోల్పోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

Share this post

scroll to top