బాబు చూపిన బాటలో రేవంత్‌..

chanra-babu-08.jpg

మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందనవనం అని పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్‌ దీనిని ఆధునిక భాషలో రివర్‌ ఫ్రంట్‌ అన్నారు. నాడు చంద్రబాబు మూసీ మురికి నీటి ప్రక్షాళన గురించి పట్టించుకోకుండా సుందరీకరణే ముఖ్యమని, పేదల తరలింపే ఫస్ట్‌ ప్రియారిటీగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌. రేవంత్‌ కూడా ప్రక్షాళన అని పైకి చెప్తూ మూసీని క్లీన్‌ చేయడానికి బదులు పేదలను క్లీన్‌ చేసే పనిలో పడ్డారు. మూసీ ఒడ్డు నుంచి తరలించే పేదల కోసమంటూ నాడు బాబు కర్మన్‌ఘాట్‌ సమీపంలో నందనవనం అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు. రేవంత్‌రెడ్డి ఆ మాత్రం కష్టం కూడా పడకుండా కేసీఆర్‌ నిరుపేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లను నింపుతున్నారు.

అప్పుడుచంద్రబాబు ఇప్పుడు రేవంత్‌ పేదల్ని బలవంతగా తరలించడం షరా మామూలే! అప్పుడూ అవినీతి ఆరోపణలు గుప్పుమనడమే కాదు ఏకంగా రుజువయ్యాయి. ఇప్పుడూ మూసీ భారీ స్కామ్‌ ముక్కుపుటాలు అదిరేలా కంపు కొడుతున్నది. ఈ పోలికలన్నీ ఇట్లా ఉంటే తాజాగా మరో అద్భుతమైన పోలిక వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఐదేండ్ల కింద అమరావతి ప్రాజెక్టును చేపట్టి, గ్రాఫిక్‌లతో రంగుల కలలు చూపించి, సగంలో వదిలేసిపోయిన సింగపూర్‌కు చెందిన ‘మెయిన్‌ హార్ట్‌’ కంపెనీయే ఇప్పుడు మూసీ కథకు అసలు కన్సల్టెంట్‌. ఈ మేరకు శుక్రవారమే రహస్యంగా జీవో కూడా జారీఅయ్యింది. 

Share this post

scroll to top