ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి చేశారు. పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ మంగ్లీ కొత్త వివాదంలో చిక్కుకుంది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ. పార్టీలో గంజాయి తీసుకుంటూ కోందరు పట్టుబడ్డారు. గంజాయితో పాటు విదేశీ మద్యం కూడా పట్టుకున్నారు. ఇలా అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను, త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ తో పాటు, మంగ్లీ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే డీజే కూడా అనుమతి లేకుండా ప్లే చేసినందుకు డిజే సీజ్ చేశారు. కాగా ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ తదితరులు ఉన్నట్లు గుర్తించారు. పద్దతిగా కనిపించే మంగ్లీ ఇలాంటివి ప్రోత్సహించడం ఏంటీ అంటూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం..
