రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో జరుగుతున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా పీఈటీ జోష్ణ తమను వేధిస్తుందంటూ విద్యా్ర్థులు రోడ్డుకెక్కారు. గురువారం ఉదయం 5 గంటలకే సిరిసిల్ల సిద్దిపేట ప్రధానరహాదారిపై నిరసనకు దిగారు. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్ లో కావాలని వేధింపులకు గురిచేస్తోందని, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగుల గొట్టి వీడియోలు తీస్తూ సైకోలాగా వ్యవహరిస్తుందని బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం చేయాలంటూ 500 మంది విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు.
సైకో పీఈటీ బాలికలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి దారుణం..
