4వ వారం ఎలిమినేషన్ ఫిక్స్..

bigg-boss-27.jpg

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు అనే వాళ్లు లేరు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 35 శాతం వరకూ ఓటింగ్ సాధిస్తున్నాడు. ఇలా ఈ వారం మొత్తం అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారంలోని ఓటింగ్‌లో నబీల్ హవాను చూపిస్తున్నాడు. అతడి తర్వాత ప్రేరణకు కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య చాలా తక్కువగానే తేడా ఉన్నట్లు తెలిసింది. ఇక, గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత మణికంఠకు ఓటింగ్ పెరిగి మూడో స్థానానికి చేరుకున్నాడు. వీళ్ల తర్వాత అంటే నాలుగో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు తెలిసింది.

నాలుగో వారం ఓటింగ్‌లో ప్రస్తుతం ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈరోజుతో ఓటింగ్‌ ముగియనుంది. దీంతో 4వ వారంలో సోనియానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంతా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇది మారితే బిగ్ బాస్ షోపై క్రెడిబిలిటీ పోయి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Share this post

scroll to top