సౌత్ హీరోయిన్స్‌ని అలా చూసేవారు..

rejena-30.jpg

యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ కొత్త జంట పిల్ల నువ్వు లేని జీవితం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ‘నేనే నా సినిమాలో నటించింది. అయితే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకున్న ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ రాలేదనే చెప్పాలి. ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌ లో అవకాశాలు రావడమే ఆగిపోయాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ పై కన్నేసి అక్కడికి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ విదాముయార్చి అనే మూవీలో నటిస్తోంది. స్టార్ హీరో అజిత్ కుమార్, హీరోయిన్ త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక అర్జున్‌కి జోడిగా రెజీనా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Share this post

scroll to top