ఆంధ్రప్రదేశ్‌ని దగా చేసింది ఎన్డీయే,టీడీపీపై రామకృష్ణ ఫైర్..

ramakrishna-20.jpg

ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్‌ని దగా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే అని రామకృష్ణ ఆరోపించారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా అమలు చేయాలని సీపీఐ రామకృష్ణ కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం కరెక్ట్ కాదాని హితవు పలికారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.

Share this post

scroll to top