మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. 

sri-leela-.jpg

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర అనేకమంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. కాగా ఈ టాప్ హీరోయిన్స్ లో మన తెలుగు హీరోయిన్ ఎవరు ఉన్నారు అంటే డెఫినెట్ గా యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీ కలిగిన యువ నటి శ్రీలీల అనే చెప్పాలి. కాగా శ్రీలీల ఇప్పుడు ఇండియా లోనే ఉన్నటువంటి అందరి హీరోయిన్స్ లో అత్యధిక సినిమాలు చేస్తున్న ఒక హీరోయిన్ గా చేతిలో పలు ప్రాజెక్ట్స్ పెట్టుకోగా రానున్న రోజుల్లో పలు భారీ చిత్రాలు అది కూడా అగ్ర తారలతో కలిసి కనిపించనుంది. కాగా ఈమె నటించిన రీసెంట్ సినిమా గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయగా తెలుగులో భారీ వసూళ్ళని సొంతం చేసుకుంది. అంతే కాకుండా తన కుర్చీ మడతపెట్టి సాంగ్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాగా శ్రీలీల అంటే ఒక మాస్ ఎనర్జీ, మాస్ డాన్సర్ కూడా అని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వరకు పలు చిత్రాల్లో హీరోయిన్ గానే కనిపించిన ఆమె ఇప్పుడు ఒక ఐటెం గర్ల్ గా మారిందా అన్నట్టు కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల ఒక స్టార్ హీరో కోసం మొదటిసారిగా ఐటెం సాంగ్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఆ హీరోతో ఇది ముచ్చటగా మూడోసారి ఆమె నటించడం అన్నట్టుగా తెలుస్తుంది. కాగా శ్రీలీల తెలుగులో రామ్, మహేష్ బాబు, రవితేజ నితిన్ ఇలా చాలా మంది స్టార్స్ సరసన నటించేసింది. కానీ మూడు సార్లు మాత్రం ఒక్క హీరోతోనే కనిపించనుందట. కాగా ఆ హీరోనే మరెవరో కాదు మాస్ మహారాజ రవితేజ.

Share this post

scroll to top