నందమూరి లెగసినీ అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కంటిన్యూ చేస్తున్నారు. అన్నగారి సినీ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఈ ముగ్గురు మంచి మంచి సినిమాలతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఇక త్వరలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సైతం ఎంట్రీకి రెడీ అయిపోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఇప్పటికే మోక్షజ్ఞకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. నటసింహాం వారసుడు మాములుగా లేడుగా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. ఇక బాలయ్య తన కొడుకు ఎంట్రీ బాధ్యతల్ని టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సైతం మోక్షజ్ఞ డెబ్యూకు మాములుగా ప్లాన్ చేయట్లేదని ఇన్ సైడ్ టాక్. అదీ కాకుండా తన యూనివర్స్‌లోనే ఒక సూపర్ హీరో ఫాంటసీ స్టోరీతో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయనున్నాడట. ఇక ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా కోసం కాస్టింగ్ ను ఎంపిక చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు కానీ కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని మరోసారి మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.
అన్నగారి సినీ ఇమేజ్ చెక్కు చెదరకుండా..
