వర్జినిటీ అనేది ముఖ్యం కాదు..

priyanka-27.jpg

ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ చాలా మంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జిన్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైనది కాదు. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకునే అమ్మాయి మనకు భార్యగా రావాలి అని కోరుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతని కోసం ఏదైనా చేస్తుంది. అయితే కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి అదృష్టం కూడా ఉండాలి. అది వర్కౌట్ అవ్వకపోతే వేరొకరిని పెళ్లి చేసుకుంటాం అంతే కానీ వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top