73 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ డమ్‌తో పిచ్చెక్కిస్తున్నారకు సూపర్ స్టార్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ రేసులో దూసుకుపోతున్నారు రజినీ. ప్రస్తుతం వెట్టైయాన్ షూట్ పూర్తి చేసిన రజినీ.. త్వరలోనే కూలీ షూట్‌లో అడుగు పెట్టనున్నారు. జైలర్‌కు ముందు రజినీకాంత్ పని అయిపోయింది.. ఇక ఆయన ఫామ్‌లోకి రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఒక్క సినిమాతో సీన్ అంతా మార్చేసారు సూపర్ స్టార్.
వెట్టైయాన్ కోసం 200 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఆయన.. లోకేష్ కనకరాజ్‌తో చేయబోయే కూలీ సినిమా కోసం ఏకంగా 260 కోట్లు అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెమ్యునరేషన్ విషయంలో రజినీ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా గోట్ కోసం విజయ్ 175 కోట్లు అందుకుంటున్నారు. ఇక నెక్ట్స్ సినిమా కోసం 250 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి10 కోట్లు ఎక్కువే కూలీ కోసం ఛార్జ్ చేస్తున్నారు రజినీ. అలాగే లోకేష్ కనకరాజ్ సైతం 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. జూన్ 6 నుంచి కూలీ సెట్‌లో జాయిన్ కానున్నారు సూపర్ స్టార్.