ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారు. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం అయితే, ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్ రెడ్డి. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో ఒక భాగమేనన్నారు. ఇక, బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ..
