రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు..

ttd-30.jpg

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా సుబ్రహ్మణ్యస్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు విచారణ నేపథ్యంలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇరు వర్గాలను ఉద్దేశించి పలు కీలక ప్రశ్నలను సంధించింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు. తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా అలాగే తయారైన లడ్డూలను టెస్టింగ్‌ కి పంపారా లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ జోక్యం పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

Share this post

scroll to top