హీరోయిన్లే స్వయంగా ఐటెం సాంగ్స్ వేస్తున్నారు. బాలీవుడ్‌లో మొదలైన ఈ కల్చర్ నెమ్మదిగా ఇతర ఇండస్ట్రీలకు సైతం విస్తరించింది. అనుష్క, కాజల్, సమంత, తమన్నా, శ్రీయా వంటి స్టార్ హీరోయిన్లు ఓ పక్క సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ తోనూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరిలో తమన్నా అందరికంటే ముందున్నారు. అంతేకాదు ఈమె ఐటెం సాంగ్ చేస్తే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ సినీ జనాల్లో బలంగా నాటుకుపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో తెరకెక్కిన స్త్రీ-2 సంచలన విజయం నమోదు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామోడీ హార్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషించారు. స్త్రీ-2 విషయంలోనూ తమన్నా సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ ఆజ్ కీ రాత్ అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ లో నటించారు. తన నడుము ఒంపులు, కళ్లు చెదిరే స్టెప్స్ తో అదరగొట్టింది.
స్త్రీ 2 మూవీలో మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్..
