తమన్నా పర్సనల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గతేడాదిగా ఈ మిల్కీ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటుడు విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో పలు హాట్ సోర్టీస్ సర్కిలేట్ అవుతున్నాయి. కానీ, ప్రస్తుతం తనకు మ్యారేజ్ చేసుకునే మూడ్‌లో లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో రిలేషన్ షిప్ లో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తాను టీనేజ్ లో ఉన్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డానని, కానీ కొన్ని కారణాలతో ఆ లవ్ బ్రేకప్ అయ్యిందనీ, తన లైఫ్ లో తన హృదయం రెండుసార్లు బ్రేకప్ జరిగిందని తెలిపింది.
తొలిసారి ఒక వ్యక్తి కోసం తనకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చలేదనీ, జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు అన్వేషించాలని భావించాననీ, ఆ కారణంగానే తొలి బంధం నిలువలేదని చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల తరువాత మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నాననీ, కానీ అతడు నాకు కరెక్ట్ కాదనిపించిందన్నారు. అలాంటి వ్యక్తితో బంధమంటే ప్రమాదమని అర్థమైందనీ, అలా రెండో సారి తన హృదయం ముక్కలైందని చెప్పుకొచ్చింది.