కమ్మ భవన్‌లో కలకలం చోటు చేసుకుంది. మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కమ్మ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యే ముందే ఆత్మహత్యాయత్నానికి కార్యకర్త పాల్పడ్డాడు. అనంతపురం కమ్మ భవన్‌లో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముందే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు టీడీపీ కార్యకర్త వెంకటేష్. పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని, గెలిచాక తనను ఎవరు పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు టీడీపీ కార్యకర్త. పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త వెంకటేష్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం..
