జడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గం..

srikanth-03.jpg

ల‌క్కిరెడ్డిప‌ల్లె జెడ్పీటీసీ ర‌మాదేవి ఇంటిపై టీడీపీ నేత‌లు దాడికి దిగ‌డం దుర్మార్గ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ఆదివారం అర్ధరాత్రి టీడీపీ మూక‌లు ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేసి జెడ్పీటీసీ భ‌ర్త రెడ్డ‌య్య‌ను హ‌త్య చేసేందుకు ప‌థ‌కం ర‌చించార‌ని ఫైర్ అయ్యారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న జెడ్పీటీసీ ఇంటిని ప‌రిశీలించి, కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. నిన్న రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన రామాదేవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఆమె జెడ్పీటీసీగా ప్ర‌తినిధ్యం వ‌హిస్తుండ‌గా రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించి భీభ‌త్సం చేశార‌ని ఫైర్ అయ్యారు. సొంత డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జెడ్పీటీసీ కుటుంబం కుటుంబాన్ని అంత‌మొందించాల‌ని కుట్ర‌లు చేయ‌డం హేయ‌మ‌న్నారు.

Share this post

scroll to top