రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు.. అది మామూలు భోజనం కాదు.. ఇసుక భోజనం.. ఇసుకనెలా తింటారు.. దానిని ఎలా అరిగించుకుంటారా.. అని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను ఆరగించారు. ఇసుకను భోంచేయడం అంటే.. ఎక్కడికక్కడ డిమాండ్‌ను బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అన్నమాట.. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు.
రాగానే మింగేశారు..’ఇసుక బకాసురులు
