నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే తాచుపాము జగన్..

budha-venkaanna-13-.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విరుచుకుపడ్డారు.ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు.ఐదు అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ తాచుపాముకు తన మన బేధం‌ లేదని.. ఎవరినైనా కాటేస్తాడని టీడీపీ నేత అన్నారు.వైఎస్, జగన్‌లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు. చివరకి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. దేశం మొత్తం, ఇతర దేశాల్లో స్థిరిపడిన వారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని తెలిపారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు.ఇంకా అబద్దాలతో ‌ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారన్నారు. ‘

Share this post

scroll to top